5 minutes to die

జనన మరణాల మధ్య పోరాటమే ఈ జీవితం…………………….

ఐదు నిమిషాల్లో ప్రాణం విడిచే నేను. నా శత్రువు గురించి, నా జీవితం గురించి ఆలోచించడం లేదు.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ప్రేమ గురించి, నా కుటుంబం గురించే నా ఆవేదన, ఆక్రోశం. జీవితంలో మనకు ఏది శాశ్వతం కాదు. అని ఇప్పుడు అర్ధం అవుతుంది.మనిషి ఆశకు అంతం మరణం మాత్రమే.
చిన్నప్పుడు నుండి ఎన్నో విషయాలకు భయ పడి ఉండొచ్చు. కానీ నా మందు నిల్చున్న మరణానికి మాత్రం భయపడడం లేదు. ఎందుకంటే నాకు తెలుసు మరణం శరీరానికే కానీ నా మనసుకు కాదు.
కానీ ఒక్క విషయంలో బాధగా ఉంది. నా చివరి శ్వాసవరకు ఈ భూమిని, నా కుటుంబాన్ని, నా ప్రేమను కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాను. కానీ ఆ ప్రతిజ్ఞ ఇంత తొందరగా ముగుస్తుంది అని అనుకోలేదు.

నేను తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే ఇప్పుడే క్షమించండి ఎందుకంటే కొద్ది క్షణాల్లో నేను ఈ గాలిలో కలిసిపోతాను.
ఒక పువ్వు కూడా చనిపోయేటప్పుడు ఒక సైనికుడి పాదాల కింద నలిగి అమర మరణం పొందాలి అని అనుకుంటుంది.
కానీ ఇప్పటివరకు నా జీవితంలో నేను సాధించింది అంటూ ఏదీ లేదు. కానీ నాదొక చిన్న కోరిక కనీసం నేను చనిపోయాక, నా శరీరంలోని భాగాలను Donate చేయండి. అలాగైనా నేను మరణాన్ని జయిస్తాను.
ఒక వస్తువు మన చేయి జారిన తర్వాతే దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అవసరం తెలుస్తోంది. అలాగే ఇప్పుడు అర్ధం అవుతుంది. నేను ఒక అందమైన భూతల స్వర్గం నుండి వెళ్లిపోతున్నానని.
ఒక్క విషయం చెప్పాలని ఉంది జీవితంలో ఎంత సాధించినా, ఎంత ఓడిన. మీ మనసు నిండా మధుర జ్ఞాపకాలను నింపుకోండి ఆవే శాశ్వతం.

Story by

Jinka Varun

Jinka Varun

Writer