MY LOVELY ANGEL

నా బుజ్జి బంగారం……!
మొట్ట మొదటి రోజు నుండి నువ్వు, నాకు అర్ధం కావడం లేదు.
కానీ చాలా అంటే చాలా బావుంది. నీతో ఉండటం.
ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎంత ఇంటలీజెంట్ గా ఎంతో maturity గా మాట్లాడుతావు.
అసలు ఈ అమ్మాయికి నేను set అవుతాన అని……………..?
కొన్ని కొన్ని సార్లు మైండ్ కు పిచ్చి పట్టిస్తారు. నువ్వు మాట్లాడే మాటలకు నాకు పిచ్చెక్కిపోతుంది……………!
అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నీకు కలెక్టర్ మొగుణ్ణి నేనేనని.
నువ్వు చెప్పే మాటల్లో సోది తప్ప మ్యాటర్ ఉండదు. కానీ ఎందుకో తెలియదు నువ్వు చెబుతుంటే అలా వింటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది.
మీ ఇంట్లో ఎవరు నాకు తెలియదు అప్పుడే నీ శత్రువులు నా శత్రువులు గా మారారు. I mean నువ్వు మార్చావు అనుకో.
ఒక్కొక్క సారి నాకు నాపై నాకే చిరాకు వచ్చినప్పుడు నువ్వు చూపించే ప్రేమ……….. నువ్వు నీ కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావు చూడు. అప్పుడు నీకోసం ఏదైనా………….. ఆఖరికి నన్ను నేను నీకు అంకితం చేసుకుందాం అనిపిస్తుంది.
నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది కదే…………. నా బుజ్జి బంగారం.
నేను కోపంలో ఉన్నప్పుడు ఎంత తిట్టినా భరిస్తావు …………
నీ బుంగమూతి మూర్తి చూస్తే చాలు నా కోపం మొత్తం ఆవిరి అయిపోతుంది.
ఈ ప్రపంచం నేను ఎక్కడవున్నా ఎంతమందితో  ఉన్నా నేను నా లాగా ఉండగలిగేది నీతోనే…………….
నా ఇష్టం నువ్వే…………………………………..!
నా కోపం నువ్వే…………………………………..!
నా ప్రాణం నువ్వే…………………………………..!
నా శ్వాస నువ్వే…………………………………..!
నా బుజ్జి కాదా! ఈ జీవితాంతం నా తోనే ఉండిపోవే………………………………………!

Story by

Jinka Varun

Jinka Varun

Writer